
పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి.
Cpim జిల్లా కార్యదర్శి బందు.సాయిలు.
ఫారెస్ట్ అధికారుల దాడులు వెంటనే అరికట్టాలని పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని సిపిఐ ఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు.
తేదీ 30 5 2023 మంగళవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కారల్ మార్క్స్ కాలనీ శ్రామిక భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ వెలిసెట్టి రాజయ్య గారి అధ్యక్షతన జరిగింది.
అనంతరం జిల్లా కార్యదర్శి బందు సాయిలు గారు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అనునిత్యం ఫారెస్ట్ అధికారుల దాడులు, దమనాఖాండలు ఆదివాసులపై జరుగుతున్నాయని అన్నారు.ఉదాహరణకు: పలిమళ మండలం లోని బొడైగుడెంకు చెందిన రైతు గత 20 సంవత్సరాలుగా సాగుచేసుకొని జీవనం గడుపుతున్న వ్యవసాయ భూమిలో ప్రతి సంత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ట్రాక్టర్ తో దుక్కి దున్నుతుండగా సోమవారం రోజున ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్ నీ అక్రమంగా పోలీసు అధికారుల అండతో పట్టుకొని వెళ్ళడం జరిగిందని వారు అన్నారు, అదేవిధంగా ఈ మద్యకలంలో భూపాలపల్లి మండలంలోని దూదేకులపల్లి రేంజ్ పరిధిలో ఉన్న వెన్నెల మడుగు ఆదివాసి గూడెంపై దాడి చేసి గుడిసెలను మొత్తం కూల్చి జెసిబి డోజర్ తో నెట్టేసి కాల్చి బూడిద చేశారని వారు పేర్కొన్నారు. ఈ దాడుల పరంపర నిరంతరం కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వమే జూన్ 24 నుండి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తానని,వాటికి రైతు బందు,నీళ్ళు,కరెంటు ఇస్తామని చెబుతుంటే, మరోవైపున ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఫారెస్ట్ అధికారులు రైతులపై దాడులు చేయడం ఇదెక్కడి అన్యాయం అని వారు అన్నారు. ప్రభుత్వ విధానాలకు ఫారెస్ట్ అధికారులు కట్టుబడి ఉండర ఆని వారు ప్రశ్నించారు.వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని, అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని, ఆదివాసులపై ఆదివాసి గుడాలపై దాడులు దమణ ఖాండలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య,ప్రీతి,శ్రీకాంత్ పార్టీ నాయకులు శేఖర్, శ్రీధర్,కిట్టు రమేష్ తదితరులు ఉన్నారు.