
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు
సూర్యాపేట: మితవాద శక్తులు విజృంభిస్తున్న ఈ తరుణంలో ఫాసిజంపై అరుణ సైన్యము విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనిసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిడబ్ల్యుసి గోదాం లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఫాసిజంపై ఎర్రసైన్యం విజయo సాధించిన 80వ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలోని జర్మనీ ఇటలీ జపాన్ దుష్టశక్తులు ఏకమై ప్రపంచాన్ని తమ పాద ప్రాంతం చేసుకోవడం కోసం 1939లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ యుద్ధంలో అనేక దేశాలను జర్మనీ ఫాసిస్టు సైన్యాలు ఆక్రమించుకున్నప్పటికీ ఆఖరికి బ్రిటన్ కూడా ఆక్రమించుకునే క్రమంలో సోవియట్ రష్యాపై జర్మనీ ఫాసిస్ట్ సైన్యాలు దాడి చేసిన అని ఆ సైన్యాలను విజయవంతంగా ఎదుర్కొని రెండో ప్రపంచ యుద్ధంలో ఎర్రసైన్యం విజేతగా నిలిచిందని అన్నారు. ఈ యుద్ధంలో సోవియట్ రష్యాకు చెందిన రెండు కోట్ల మంది పౌరులు వీరోచితంగా పోరాడి మరణించారని అన్నారు.అందులో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు 30 లక్షల మంది ఉన్నారని అన్నారు. ఎర్రసైన్యం దాటికి బెదిరిపోయిన హిట్లర్ తన రాజ భవనంలో ఉరివేసుకొని చనిపోయినాడని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపుగా జర్మనీ దేశము బెర్లిన్ నగరంలోని రిచ్ స్టాగ్ పార్లమెంట్ భవనం పై 1945 మే 9 వ తారీఖున ఎర్రజెండాను ఎత్తి రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికినట్లు చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ రష్యా ఎర్రసైన్యాలు విజయ దుందుభిని చూసి ప్రపంచ ప్రజానీకము ప్రధానంగా తూర్పుయూరఫ్ లోనే 15 దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయని అన్నారు.వలస దేశాలుగా ఉన్న అనేక దేశాలు వలస పాలన నుండి విముక్తి చెందాయన్నారు . ఆ స్ఫూర్తితోనే భారతదేశంలో అనేక ప్రాంతాలలో ప్రజా ఉద్యమాలు ఊపు అందుకున్నాయని అందులో ముఖ్యమైంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అన్నారు. ప్రజలు అనేక పోరాటాలతో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం,హక్కుల్ని సాధించుకోగా నేడు ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తులు విజృంభించి ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించి వేస్తున్నాయని అన్నారు. నేడు దేశంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన అనేక హక్కుల్ని కాలరాస్తూ ఆప్రజాస్వామిక ఫాసిస్ట్ నియంతృత్వాన్ని అమలుజయపూనుకుంటున్నాదని అన్నారు. నేడు దేశంలో వ్యవసాయ రంగము తీవ్ర సంక్షోభంలో ఉండగా రైతులను సంక్షోభం నుంచి బయట పడేయడానికి బదులు వ్యవసాయాన్ని రైతులను కార్పొరేట్ దళారీ వ్యాపారస్తులకు దోచుకోవడానికి అనుగుణంగా చట్టాలను మార్పు చేస్తున్నాడని విమర్శించారు. రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడం కోసం కేంద్రంలోని మతోన్మాద బిజెపి కార్పొరేట్ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టాలని కోరారు. ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతున్నాయని కొన్ని దేశాలలో మితవాద శక్తులను ఓడించి వామపక్ష ప్రగతిశీల శక్తులు అధికారంలోకి వస్తున్నాయని మన పొరుగునే ఉన్న శ్రీలంక మరియు నేపాల్ దేశాలలో కమ్యూనిస్టు వామపక్ష ప్రగతిశీల శక్తులు అధికారంలోకి వచ్చాయని గుర్తు చేశారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం కార్మికుల వ్యవసాయ కార్మికుల రైతాంగం హక్కుల కోసం మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మరియు గ్రామీణ బంధు జరుగుతున్నాయని వీటిలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు అధ్యక్షతన జరిగిన ఈ వార్షికోత్సవ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, జిల్లా నాయకులు చిన్నపంగా నరసయ్య, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, సిడబ్ల్యుసి హమాలి యూనియన్ అధ్యక్షులుబాలరాజు తదితరులు పాల్గొన్నారు.