
గోషామహల్ లో పోస్టర్ ఆవిష్కరించిన సీటు
- – సీటు నేత ఎల్ కోటయ్య
- గోషామహల్ లో పోస్టర్ ఆవిష్కరించిన సి ఐ టి యు
- —- —- —- —–
- ప్రపంచం లో నా జాతే గొప్పదని జాత్యహంకారం తో అప్పటి సోషలిస్ట్ రష్యా పై 2 వ ప్రపంచ యుద్ధానికి (1945 ) దిగిన నియంతృత్వ హిట్లర్ సైన్యాన్ని రష్యా ఎర్ర సైన్యం తరిమికొట్టిందని, లక్షలాది రష్యన్ ప్రజలు, ఆ దేశ సైన్యం చూపిన సాహసం తో మే 9 వతేదీనీ ఫాసిజం ఎర్ర సైన్యం సాధించిన విజయం చరిత్రలో లిఖించబడిందని,ఆస్పూర్తి తో హక్కుల రక్షణకు నడుం బిగించాలని సీటు ( సి ఐ టి యు) అనుబంధ ట్రాన్స్పోర్ట్ రంగ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎల్ కోటయ్య పిలుపునిచ్చారు. నేడు గోషామహల్ జోన్ కమిటి ఆధ్వర్యంలో అఫ్జల్ గంజి ఆటో స్టాండ్ డ్రైవర్లతో కలిసి సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు.
- పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరనకు గాను కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగివచ్చేలా మే 20 వ తేదీన జరగనున్న జాతీయ సమ్మె లో రవాణా రంగం లోని కార్మికులు అంతా పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
- గోషామహల్ ట్రాన్స్పోర్ట్ రంగం ( సి ఐ టి యు ) ఆధ్వర్యంలో సిఐటియు ట్రాన్స్పోర్ట్ కమిటీగా ఫాసిజం మీద.ఎర్ర సైన్యం సాధించిన విజయం రోజును ( మే 9 వ తేదీ) పురస్కరించుకొని ఈరోజు ఉదయం ఉస్మానియా దవాఖాన పాతమెయిన్ గేటు ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోషామహల్ ట్రాన్స్పోర్ట్ రంగం ( సి ఐ టి యు) అధ్యక్షులు సత్యనారాయణ సిఐటియు ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా కార్యదర్శి ఎల్ కోటయ్యలు పాల్గొని ప్రసంగించారు వారు మాట్లాడుతూ ఎర్ర సైన్యం చూపిన పట్టుదలను స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతం లోని రవాణా రంగ కార్మికుల్లో విస్తృతంగా సమ్మె ప్రచారం చేయాలని అన్నారు.
- ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ నాయకులు ఖాజా మోయిముద్దీన్,రాజా,బషీర్ తదితర ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు