
telugu galam news e69news local news daily news today news
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలని,అలాగే పర్మినెంట్ చేసి ఈఎస్ఐ,పిఎఫ్ సక్రమంగా అమలు చేసి పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచాలని చేసే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కోరారు.హైదరాబాదులో చెత్త కుండీలు చౌరస్తాల వద్ద ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ చెత్త వేసే విధంగా చూడాలని క్లీన్ సిటీ పేరుతో చెతకుండీలు తీసివేసిన ప్రభుత్వం ప్రజలందరూ కూడా రోడ్లమీద చెత్త వేయడం వల్ల మున్సిపల్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.చౌరస్తాల వద్ద కార్మికులను పర్యవేక్షణకు పెట్టినా కూడా లాభం లేకుండా పోతుందని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పండగల సందర్భంగా కార్మికులకు ఉదయం5 నుండి 10గంటల వరకం హాఫ్ డే డ్యూటీలు పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు నగేష్,సుగుణమ్మ,తులసి బాయ్,నాగమణి,పుష్పలత తదితరులు పాల్గొన్నారు.