ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోసేవా కార్యక్రమం
కొడకండ్ల మండల కేంద్రంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో మానవతా సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జనగామ జిల్లా,లింగాలఘనపూర్ మండలం,నెల్లుట్ల గ్రామ శివారులో గత కొన్ని సంవత్సరాలుగా కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేద కుటుంబాల పిల్లలు శీతాకాలంలో తీవ్ర చలికి ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన వెంటనే ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ స్పందించింది.ఈ విషయాన్ని హైదరాబాద్ వివేక్‌నగర్,చిక్కడపల్లి ప్రాంతంలో గోకుల్ కిరణం షాప్ నిర్వహిస్తున్న ప్రొప్రైటర్లు పద్మాలయ గోవర్ధన్-హేమాలి దృష్టికి తీసుకెళ్లగా,వారు వెంటనే స్పందించి 30 మంది పిల్లలకు విలువైన బెడ్షీట్లు అందజేశారు.ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆ బెడ్షీట్లతో పాటు అరటి పండ్లను కూడా పిల్లలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ పెద్దపూడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,“స్థిర నివాసం లేక చిన్న చిన్న గుడిసెల్లో జీవనం సాగిస్తున్న కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.ముఖ్యంగా చలికాలంలో పిల్లలకు కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయడానికి ముందుకు రావాలి”అని పిలుపునిచ్చారు.అలాగే,నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సహాయం,పుస్తకాలు,పెన్నులు,స్కూల్ బ్యాగులు తదితర అవసరమైన వస్తువులు అందించాలనుకునే వారు