ఈ69న్యూస్ జనగామ:-జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి,గోపాల్‌నగర్,చిన్న రాంచెర్ల గ్రామాల్లో క్లస్టర్ ఇన్చార్జిలు మేకల రాంప్రసాద్, మహమ్మద్ గులాం బాయ్,మహమ్మద్ యాకుబ్ పాషా ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో మండల నాయకుడు ఇర్రి రమణారెడ్డి పాల్గొని గ్రామస్థుల సమస్యలు,కార్యకర్తల అభిప్రాయాలను వినిపించారు.గ్రామస్థాయి నాయకులు,కార్యకర్తలు తమ అభిప్రాయాలు,పరిష్కారాలపై చర్చించారు.ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్చార్జిలు మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా,బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు ఐక్యంగా,సమన్వయంతో పనిచేయాలి అని పిలుపునిచ్చారు.పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ గ్రామ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొన్నారు.