
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా వారికి ఖిలా వరంగల్ 38వ డివిజన్ అధ్యక్షులు ఎల్లబోయిన చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ నాయకులు గంట రవికుమార్
అనంతరం రవికుమార్ మాట్లాడుతూ..
భరతమాత ముద్దుబిడ్డ, రాజనీతిజ్ఞుడు, భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడే దిశగా వారు చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ప్రేరణాత్మకం. విలువల కోసం కట్టుబడిన వారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని,
ఏక్ దేశ్ మె..దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగా..”అంటూ నినదించి, కాశ్మీర్ భారత్ లోని అంతర్భాగమనీ నిరంతర పోరాటం చేసి అమరుడైనడు అన్నారు.
ఈ కార్యక్రమంలో తూర్పు ఐటీ & సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్, ప్రోగ్రాం ఇంచార్జీ డివిజన్ ఉపాధ్యక్షులు కండ్రాతి సీను, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇనుముల రాజు, డివిజన్ సోషల్ మీడియా కన్వీనర్ పుప్పాల ప్రవీణ్, ఆకుతోట కిరణ్, రాళ్లబండి మున్నా, ఇనుముల మూర్తి పాల్గొన్నారు.