బహుజన రాజ్యస్థాపన కోసం యువత ముందుండాలి
Mahabubabad- బిఎస్పీ జిల్లా కార్యదర్శి ఐనాల పరశురాములు
తెలుగు గళం న్యూస్ డోర్నకల్:-
బహుజన రాజ్యస్థాపనకోసం యువత ముందుండాలి. అక్షరం, ఆరోగ్యం, ఆర్ధికం ఆరెస్పి లక్ష్యం అని బిఎస్పీ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు పిలుపునిచ్చారు.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ మరిపెడ మండలంలోని ఉల్లేపల్లి గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ జనరల్ బాడీ సమావేశం ఎడ్ల లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమానికి బిఎస్పీ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు ముఖ్యఅతిధిగా పాల్గోని ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి ఎనమిది దశాబ్దాలు పూర్తయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కేవలం తక్కువ జనాభా కలిగిన బ్రాహ్మణులు రెడ్లు, కమ్మలు, వెలమ దొరలు మాత్రమే పదే పదే అధికారం మార్పిడి చేసుకొంటూ పాలిస్తున్నారని అధిక జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు,అగ్రకుల పేదలకు ఓరిగింది సూన్యం అని, మళ్ళీ అధికార మార్పిడి కోసం రెడ్లు ఏకమవుచున్నారని స్థానిక ప్రజాప్రతినిధులను నడిపేది దొరలేనని వారి పాలనను పాతరేయుటకు బహుజనులు ఏకం కావాలని అన్నారు.డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలొ సబ్బండా జాతులు ఏకమై బహుజన రాజ్యం సాధించుకొని జనాభా ప్రాతిపధికన రాజ్యాధికారన్ని అనుభవించాలని అన్నారు.అనంతరం రెండు బూత్ కమిటీలను నియమించడం జరిగింది. ఈకార్యక్రమంలో బిఎస్పీ మరిపెడ మండల అధ్యక్షులు జినక కృష్ణమూర్తి, గ్రామ నాయకులు మేడెబోయిన నాగరాజు యాదవ్, దుద్ధిమెట్ల లింగన్న యాదవ్, గుమ్మడి శ్రీకాంత్, గోరెంట్ల పూర్ణచందర్, గుండ్ల శ్యాంసుందర్ పద్మశాలి, మంచ గణేష్ యాదవ్, ఊళ్లోజ్ మహేష్,నవీలే అప్పారావు, కంచనపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.