బాంచన్ దొర నీ కాల్మోక్తా అన్న మట్టి మనుషులచే బంధూకులు పట్టించిన చరిత్ర తెలంగాణా సాయుధ రైతాంగా పోరాటంది
Jangaonచరిత్రను వక్రీకరింస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను నిలదీయండి.
(సిపిఎం జాతీయ కార్యదర్శి ఏం.ఎ. బేబీ పిలుపు.)
వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో అమరులైన వీరులను తలచుకుంటూ సెప్టెంబర్ 1నుండి 17వరకు జిల్లాలో ఉత్సవాల ముగింపు సభ నిర్వహించడం జరిగిందని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరింస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను నీలదీయాండని సిపిఎం జాతీయ కార్యదర్శి ఏం.ఎ. బేబీ పిలుపునిచ్చారు.
దివి: 17-09-2025 బుధవారం రోజున సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన సిపిఎం జాతీయ కార్యదర్శి ఏం.ఎ. బేబీ గారిని పట్టణంలోని కళ్లెం కమాన్ వద్ద పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్ నుండి బతుకమ్మ, కోలాటం ఆటలతో మరియు డప్పు కళాకారుల కోలాహలం మధ్య పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రెస్టన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పార్టీ జాతీయ కార్యదర్శి ఏం.ఎ. బేబీ ఓపెన్ జీప్ లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిధిగా ఏం.ఎ. బేబీ పాల్గొని మాట్లాడుతూ 1871 ప్రాన్స్ లో పారీస్ కమ్యూన్ ఉద్యమంలో కార్మికులు తమ హక్కుల కోసం 70 రోజులపాటు పోరాటం చేస్తే తెలంగాణలో 1946 – 51 వరకు అంటే 5సంవత్సరాలు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 3వేల గ్రామాలు పాల్గొన్నాయని ఈ సందర్బంగా 10లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగిందన్నారు. ఈ పోరాటంలో 4వేల కార్యకర్తలు చనిపోయారు. ఈపోరాట ఫలితంగా భూసంస్కరణల చట్టం తెలంగాణలో అమలుకు వచ్చిందన్నారు. 1957లో కేరళలో భూసంస్కరణ చట్టం కోసం ఉద్యమం ముందుకు వచ్చింది. చరిత్రలో పారీస్ కమ్యూన్ కంటే తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం చాలా గొప్పదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొన్నారు, ఒక వెయ్యి మంది మహిళలు సైన్యంగా ఏర్పడి శిక్షణ తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తి మనకు అర్ధం అవుతుంది. ఈ పోరాట స్పూర్తితో దేశంలో దున్నేవానికి భూమి అనే నినాదం ముందుకు వచ్చిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తెలంగాణలో విమోచన పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. గాడ్సే 6నెలలకు ముందే సావస్కర్ వద్ద ఆశీర్వాదం పొంది గాంధీజీని హత్య చేయడం జరిగింది, దీన్ని కూడా వక్రీకరించిందని చరిత్ర ఎరిగిన సాక్ష్యం అని తెలిపారు. దేశంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 1947లో బ్రిటిష్ నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951లో నెహ్రు ప్రభుత్వం తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చూస్తున్న సందర్బంలో పటేల్ ఆధ్వర్యంలో రజాకార్ సైన్యాలు తెలంగాణలో ప్రవేశించి ప్రజలను అణిచివేయాలని చూసిందన్నారు. మోడీ పార్లమెంట్ లో మైనింగ్ చట్టాలు అంబానికి, ఆదానికి అనుకూలంగా చేస్తూ గనులను కట్టబేడుతున్నారు. మోడీ, అమితాషా, మోహన్ భగవత్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2025 చివరిలో మరియు 2026 మొదట్లో బీహార్, తమిళనాడు, బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో ఎన్నికలు రాబోతున్నాయని దేశంలో సిపిఎం, సీపీఐ, సిపిఐఏం ఎల్ మాత్రమే 4లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. ఈ పోరాటాలకు మద్దతుగా మహాకూటమి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇండియాపై అధిక పన్నులు వేస్తున్న మోడీ మాత్రం బెల్లం కొట్టిన రాయిలా ఉన్నారని హెద్దెవా చేశారు. ఇజ్రాయిల్ దేశం అమెరికా అండతో పాలస్టీనాలో ఏ నేరం చేయని పసిపిల్లపై మారణాహోమం చేస్తుందని తెలిపారు.
అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మొహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో తెలంగాణ ప్రాంతం కీలక భూమిక పోషించిందని ఈ నేపథ్యంలో సాయుధ పోరాటాల వారోత్సవాల్లో భాగంగా పోరాట యోధులను స్మరించుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు బానిసత్వం, వెట్టి చాకిరి విముక్తి కోసం, బాంచన్ దొర నీ కాల్మొక్తా అన్న బడుగు జనంచే బంధూకులు పట్టించి నిజాం నావాబు నిరాంకుశ పాలన నుండి విముక్తి కల్పించిన గడ్డ తెలంగాణ అని అన్నారు. నాలుగు లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి జాగిర్దారుల, భూస్వాముల, జమీందారుల దోపిడిని అరికట్టిన చరిత్ర కమ్యూనిస్టులది అని అన్నారు. అమరుల పోరాట స్ఫూర్తిని యువత పునికిపుచ్చుకొని రూపాంతరం చెందిన దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళన, పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే అమరుల వారసులుగా ప్రకటించుకునే హక్కు కూడా ఎర్రజెండా కార్యకర్తలకే ఉందని అన్నారు. నేడు చరిత్రను వక్రీకరిస్తూ, రజాకార్లకు తొత్తులుగా వ్యవహరించిన నేతలు విలీనం, విముక్తి, విమోచనమని గందరగోల పరిస్థితిలకు ప్రజలను నెట్టివేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో సుమారు 4వేల మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర నైజాం సర్కారుది అని అన్నారు. ఆలేరు ప్రాంతంలో ఆనాటి నైజాం నవాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కామ్రేడ్ ఏ.సి.రెడ్డి నరసింహరెడ్డి నాయకత్వంలో జరగుతున్న సందర్భంలో పట్టణంలో ఆనాటి రైల్వే గేటు ప్రాంతంలో రజాకర్ సైన్యం దాడిలో రొండ్ల పుల్లయ్య, పుసలోజు వీరయ్య, ఎలగందుల లక్ష్మి నర్సయ్య, బిర్రు నారాయణ, నూతి నర్సయ్య, చిన్నం సాయిలు అమరులు అయినారు, ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో ఎ.సి.రెడ్డి గారి తొడ నుండి బుల్లెట్ దూసుకెళ్లిన, ఆయన పోరాటం ఆపలేదు, ఆయన నిరంతరము ప్రజా సమస్యలపై పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పని చేశారని, తదనంతరం జనగాం ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. ఈనాడు పాలక పక్షాలు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంను హిందూ, ముస్లింల పోరాటంగా వక్రీకరిస్తున్నారు అని, దాన్ని కమ్యునిస్టు కార్యకర్తలు తిప్పికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి విట్టల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, బూడిది గోపి, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్, రాపర్తి సోమన్న, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, సుంచు విజేందర్, పోత్కనూరి ఉపేందర్, బోడ నరేందర్, బిట్ల గణేష్, భూక్యా చందు, మునిగేల రమేష్, కొడెపాక రమేష్, బెల్లంకొండ వెంకటేష్, మహమ్మద్ అజారోద్దీన్, చిట్యాల సోమన్న, మహమ్మద్ షబానా, మండల కార్యదర్శులు గంగాపురం మహేందర్, బొడ్డు కరుణాకర్, మాచర్ల సారయ్య, సాధం రమేష్, ఇంటి వెంకట్ రెడ్డి, గుండెబోయిన రాజు, పాండ్యాల ఆంజనేయులు, ప్రజ్ఞాపురం నర్సింహులు, తూటి దేవదానం, ధర్మబిక్షం, పట్టణ కమిటీ సభ్యులు బాల్నే వెంకటమల్లయ్య, బోట్ల శ్రావణ్, మంగ బీరయ్య, కళ్యాణం లింగం, పల్లెర్ల లలిత, పందిల్ల కల్యాణి, పాముకుంట్ల చందు, పాము శ్రీకాంత్, బూడిది ప్రశాంత్, పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ దస్తగీర్, గురిజాల లక్ష్మీర్సింహా రెడ్డి, పంపర మల్లేశం, రామావత్ మీట్య, ఆఫీస్ కార్యదర్శి సౌందర్య, ప్రజాసంఘాల నాయకులు పొదల లవ కుమార్, దాసగాని, సుమ, అజ్మిర సురేష్, దూసరి నాగరాజు, మోకు విప్లవ్, మైలారం వెంకటేశ్వర్లు, ఎదునూరి మాదార్, బాసూపాక విష్ణు, గుండెల్లి రాజు దండబోయిన సికెందర్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.