బాల్యవివాహాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమం
బాల్యవివాహాల నిర్మూలనకై వెంకన్న జాతరలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ రేగొండ,కొత్తపల్లి గోరి మండలాల ఎన్జీవో కోమల ఆధ్వర్యంలో శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరలో ప్రజలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించడానికి ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గణపురం సీఐ కర్ణాకర్ రావు పాల్గొని,మాట్లాడుతూ ప్రజలందరూ బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని గ్రామాలలో బాల్యవిహాలు జరిగినట్లయితే స్థానిక పోలీసు వారికి తెలియజేయాలని అదేవిధంగా బాలికల అక్రమ రవాణా జరిగినట్లయితే దానికి పాల్పడిన వారిని మరియు వారికి సహకరించిన వారికి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని.బాలికలను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో రేగొండ ఎస్సై రాజేష్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.