బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు
జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మరియు డిపిఆర్ఓ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి మైస ఎర్రన్న కళాబృందం ఆధ్వర్యంలో గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేటి బచావో – బేటి పడావో, బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాబృందం ఆటపాటల ద్వారా బాల్యవివాహాల హానికర ప్రభావాలు, చట్టపరమైన శిక్షలు, విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరణ ఇచ్చింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ,బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం. ఎక్కడైనా ఇందుకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1098 హెల్ప్లైన్కు తెలియజేయాలి అని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం, కళాకారులు మైస ఎర్రన్న, దుప్పటి రవి, ఈర్లసాగర్, ఎండి ఖలీల్, కొండపర్తి స్వప్న, కంచర్ల శ్యామల, గడ్డం రజిత తదితరులు పాల్గొన్నారు.