
పాఠశాల సమయంలో ఈతకు వెల్లిన నలుగురు విద్యార్ధులు..ఒకరు మృతి
పాఠశాల సమయంలో ఈతకు వెల్లిన నలుగురు విద్యార్ధులు..ఒకరు మృతి
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని జడ్ పి ఎస్ ఎస్ హైస్కూల్ లో చదువుతున్న విధ్యార్ధి పాఠశాల సమయంలో తన స్నేహితులతో బావిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు.
ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన పెద్ది కేశవులు దేవి దంపతుల ఏకైక కుమారుడు కృష్ణ ప్రసాద్ తాడ్వాయి మండలంలోని హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి చదువుతూ…
వనవాసి కళ్యాణ పరిషత్ హాస్టల్లో ఉంటుంన్నాడు. సోమవారం హస్టల్ లో టిఫిన్ చేసి హైస్కూల్ కు వెల్లడు. మద్యాహ్నం స్నేహితులతో కలిసి సమీపంలో గల బావిలోకి ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఇంటర్వెల్ టైం లో ముగ్గురు స్నేహితులతో కలిసి నర్సింగాపురం కాంభోజ చెరువు సమీపంలో ఉన్న బావిలోకి ఈత కొట్టడానికి వెల్లిన కృష్ణ ప్రసాద్ స్నేహితుల బలవంతంతో బట్టలు విప్పి బావిలోకి దిగాడు. ఈతకు దిగిన కృష్ణ ప్రసాద్ మునిగిపోతుండడంతో మిగతా విద్యార్థులు ఈతకు వెల్లిన బావి సమీపంలో కనబడిన ఒకరికి సమాచారం ఇచ్చి అతను వచ్చేలోగా స్కూల్ కు పరుగులు తీశారు. విద్యార్థుల పరుగులను గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆద్వర్యంలో స్థానికి ఈతగాళ్ళ సహయంతో కృష్ణ ప్రసాద్ డెడ్ బాడీని వెలికి తీశారు. వనవాసి కళ్యాణ్ పరిషత్ వార్డెన్ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం. రోజు వారు మాదిరిగానే కృష్ణ ప్రసాద్ ఉదయాన్నే టిఫిన్ తిని ఇంద్రనగర్ హైస్కూల్ వెళ్లాడని సాంబయ్య తెలిపారు. మృతుని బందువుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.