
మునగాల మండల కేంద్రంలోని హరిజనవాడకు చెందిన 40 మంది బిఆర్ఎస్ పార్టీ యొక్క పథకాలకు ఆకర్షితులై కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి బలమని, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అని, గులాబీ జెండాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మూడోసారి విజయకేతనం ఎగరవేస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల గ్రామ అధ్యక్షులు ఉడుం కృష్ణ పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మునగాల గ్రామ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పుల యుగంధర్ రెడ్డి, నాగబాబు, ఎల్ శ్రీను, గట్టు ఉపేందర్ ఇతరులు పాల్గొన్నారు.