
బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో 1నుండి 15వ వార్డుల ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న వార్డు కౌన్సిలర్లు,మ్యానిఫెస్టో వివరిస్తూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు,ప్రజలు లబ్ది పొందుతున్నటువంటి తీరు, డోర్నకల్ నియోజకవర్గం అభ్యర్థి డిఎస్.రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీరును వివరిస్తూ,ప్రచారం నిర్వహించడం జరిగింది. రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు,రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, వృద్ధాప్య పింఛన్లు, ఒంటరి మహిళ పెన్షన్,వికలాంగుల పింఛన్, కళ్యాణ లక్ష్మి, దళిత బంధువు, గృహలక్ష్మి పథకం,డబల్ బెడ్ రూమ్ లు,పల్లె పల్లెకు తారు రోడ్లు,సిసి రోడ్లు,అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం రేషన్ ద్వారా పంపిణీ,రేషన్ కార్డు ఉన్నవారికి ఐదు లక్షల బీమా పథకం,తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి పది లక్షల వరకు ఉచిత వైద్య,ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య,వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చేశాయి అన్నారు,మరిపెడ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మరిపెడ మున్సిపాలిటీలో 100 పడకల హాస్పిటల్, ఇండోర్ స్టేడియం, గురుకుల పాఠశాలలో, ఇంటర్ ,డిగ్రీ కాలేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయన్నారు. కారు గుర్తుకు ఓటేసి రెడ్యానాయక్ భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు కౌన్సిలర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 15 వార్డ్,కౌన్సిలర్లు,బిఆర్ఎస్ నాయకులు,మహిళా సోదరీమణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.