
మరిపెడ గళం న్యూస్.
మెప్మా ఉద్యోగుల జీతాలు బిఆర్ఎస్ ప్రభుత్వం పెంచినందుకు గాను శనివారం ఉగ్గంపల్లి లోని స్వగృహంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను సాలువతో సన్మానించి స్వీట్లు తినిపించారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు వారి స్వగృహం బీచ్ రాజు పల్లి లో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలుపుతూ శాలువతో సత్కరించి స్వీట్లు తినిపించారు.వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడిన తర్వాతనే మహిళా ఉద్యోగులకు జీతాల పెంపుతో సీఎం కెసిఆర్ సముచిత న్యాయం కల్పించారన్నారు. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా క్రింద స్థాయి ఉద్యోగులను గుర్తించలేదని,వారికి వేతనాల చెల్లింపు కూడా జరగలేదన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలో తీసుకెళ్లి మెప్మా ఉద్యోగులు వివరించాలన్నారు. మూడోసారి ఎన్నికలు బిఆర్ఎస్ ప్రభుత్వం గెలిచి క్రింది స్థాయి ఉద్యోగులకు మరింత జీతభత్యాలు పెంచుతామన్నారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ షమీమ్,కోశాధికారి గంధసిరి ఉమ,రజిత,ఉమా, స్వరూప,లక్ష్మీ,రాజేశ్వరి, మమతా,సరిత,పార్వతి ఇంకా తదితరులు పాల్గొన్నారు.