బిఆర్ఎస్ బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం
ఒంటిమామిడిపల్లి గ్రామంలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది.సర్పంచ్ పదవికి బీజేపీ–బిఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన ఆడెపు స్రవంతి -దయాకర్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.గ్రామంలోని ప్రతి వాడను సందర్శిస్తూ ప్రజలను కలిసిన స్రవంతి…”ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలి”అని కోరారు.మీడియాతో మాట్లాడిన వారు..ఒంటిమామిడిపల్లి గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.అవకాశం కల్పిస్తే గ్రామ అంతర్గత అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ప్రజల ఆదరణతో..తనను అధిక మెజారిటీతో గెలిపించాలని స్రవంతి దయాకర్ విజ్ఞప్తి చేశారు.