
బిఆర్ఎస్ మంత్రి వర్గం నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు మరిపెడ మున్సిపాలిటీలో ని తొమ్మిదవ వార్డులో కున్యా తండాలో 200 పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఏడో వార్డులోని పూల బజార్లో 150 మంది కాంగ్రెస్ పార్టీలో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేశారు. రామచంద్రనాయక్ మాట్లాడుతూ డిఎస్ రెడ్యా నాయక్ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో వెళ్లి కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం సబబే నా అని విమర్శించారు. రెడ్యా నాయక్ రాజకీయ ఎదుగుదల కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగిందని విమర్శించారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి బీహార్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం రెడ్యానాయక్ నిజస్వరూపం ఏందో ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్న డోర్నకల్ నియోజకవర్గం ప్రజలకు ఏం న్యాయం చేశాడని విమర్శించారు. మున్సిపాలిటీ కి 50 కోట్లు నిధులు వస్తే మరిపెడ మున్సిపాలిటీ చైర్పర్సన్ ను కీలుబొమ్మగా చేసిన ఘనత రెడ్యా నాయక్ దని ఏద్దవ చేశారు. ప్రజలు ఈసారి టిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని తెలియజేశారు. సంక్షేమ పథకాల పేరుతో నియోజకవర్గ అమాయక ప్రజలను మోసం చేస్తూ తన చుట్టూ తిరిగే తన మనుషులకే పథకాలు ఇవ్వడం జరిగిందని విమర్శించారు. పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు బినామీ పేర్లతో దోచుకున్న నాయకుడు ఎవరైనా ఉంటే అది రెడ్డి అనేక అని విమర్శించారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీని అందించి గెలిపిస్తారని కోరారు. నియోజకవర్గ ప్రజల్లో రోజురోజుకు రెడ్యానాయక్ ఓటమి కనిపిస్తుందని తెలియజేశారు. మైనార్టీ బందు పేరుతో మైనార్టీలను, దళిత బంధు పేరుతో దళితులను మోసం చేసిన రెడ్యానాయక్ అని విమర్శించారు. ఇసుక మాఫియా, బెల్లం మాఫియాకు అండగా ఉంటూ ప్రజల సమస్యలు మర్చిపోయిన ఎమ్మెల్యేగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. డబల్ బెడ్ యు రూమ్ పథకంలో తన అనుచరులు ఒక్కొక్క పేదవాని దగ్గర నుండి రెండు నుంచి మూడు లక్షలు కమిషన్ తీసుకొని డబల్ బెడ్లు ఇవ్వలేద అని విమర్శించారు. మైనార్టీ బందుతో ఒకటే కుటుంబానికి చెందిన తన కార్యకర్తకు అప్ప చెప్పారని, మున్సిపాలిటీ టౌన్ లో వేయి పై గా ఓట్లు ఉన్న మైనార్టీలను మోసం చేసిన రెడ్యా నాయక్ నీ ఓటు ద్వారా సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, గందశిరి అంబరీష, కాలం రవీందర్ రెడ్డి, మరిపెడ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్, గుండగాని వెంకన్న, షానవాజ్, గుండగాని వేణు, మహమ్మద్ సుబాని, మహమ్మద్ హనీఫ్,షేక్. వలి షేక్.మన్సూర్ అలీ, మహమ్మద్ మహబూబ్, మహమ్మద్ ముక్తార్, షేక్ అక్బర్, సయ్యద్ గౌస్,షేక్.లతీఫ్, కనికిచర్ల పద్మ, తదితులు పాల్గొన్నారు.