బిఎస్పీ పార్టీ చిల్పుర్ మండల కమిటీ పునర్నిర్మాణం నియామకం
Jangaonనియోజకవర్గ ఉపాధ్యక్షులు మరియు చిల్పూర్ మండల ఇంచార్జ్ నల్ల రమేష్ గారి ఆద్వర్యంలో చిల్పూర్ మండల కమిటి పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య-అతిథులుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి డా.తాళ్ళపల్లి వెంకటస్వామి
గారు, నియోజకవర్గ అధ్యక్షులు మోకినపల్లి చక్రపాణి గారు రావడం జరిగింది. ముందుగా బహుజన వాదం చరిత్ర పై నల్ల
రమేష్ గారు సెమినార్ ఇవ్వడం జరిగింది.తదనంతరం నియోజకవర్గ ఇంచార్జి మరియు అధ్యక్షుల చేతులమీదుగా బిఎస్పీ కండవాలు వేసి మండల కమిటీని నియమించడం జరిగింది. మండల కమిటీ నాయకులు తమ చుట్టు ప్రక్కల గ్రామాలను బాధ్యత తీసుకుని బూత్ కమిటీలు నియమకం చేయుటకు తీర్మానించడం జరిగింది.
చిల్పుర్ మండల కమిటి:-అధ్యక్షులు స్వర్గం స్టీవెన్ గారు
ఉపాధ్యక్షులు- మోతి కొమురయ్య గారు
ప్రధాన కార్యదర్శి -చెరిపెల్లి అనిల్ గారు
కోశాధికారి-కనకం అశోక్ గారు,
కార్యదర్శులు-టి.భారత్ గారు, ముత్యాల కుమార్ గారు, పాశం సందీప్ గార్లను ఏక్రీవంగా ఏనుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షలు జలగం ప్రవీణ్ కుమార్ గారు,ప్రధాన కార్యదర్శి చేరిపల్లి అరుణ్ కుమార్, వెంకటాద్రి పేట గ్రామ ఉపాధ్యక్షులు రఫీ గారు, గ్రామ కార్యదర్శి కనకం అఖిల్ గారు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి దార సందీప్ కుమార్ గారు,ssu జనగాం జిల్లా ఇంఛార్జి మాదారపు విజయ్ కుమార్ గారు, తదితరులు పాల్గొన్నారు