
బిజెపి నాయకురాలు పూజారి లక్ష్మీదేవికి ఘన సన్మానం
అనంతపురంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా జోనల్ సమావేశంలో బిజెపి శక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గోపి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి నిర్మల బొల్లిన పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పూజారి లక్ష్మీదేవి అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ పేర్కొన్నారు. మహిళా నాయకత్వం బలోపేతానికి ఆమె చేస్తున్న కృషికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల బొల్లిన ప్రశంసించారు. ఈ సందర్భంగా బిజెపి మహిళా నాయకురాలు పూజారి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్, సంధిరెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.