
సిఐటియూ న్యూస్ citu news local news
CITU గళం న్యూస్ హైదరాబాద్
కేంద్రంలోని మతతత్త్వ, కార్పొరేట్ బిజెపి ప్రభుత్వ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జాయింట్ ప్లాట్‌ఫారమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త ఆందోళనలను తెలంగాణ రాష్ట్రంలో జయప్రదం చేయాలని ఈరోజు (తేది: 13-01-2024) సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కా॥ చుక్క రాములు అధ్యక్షతన జరిగిన సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ పిలుపును అన్ని రంగాల్లో కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి అఖిల భారత కోశాధికారి కా॥ ఎం. సాయిబాబు మాట్లాడుతూ దేశంలో కార్మికవర్గ పరిస్థితిలు రోజురోజుకు దిగజారుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా కార్మికవర్గ పోరాటాలు కూడా ఉ దృతం అవుతున్నాయని, అంతర్జాతీయంగా యూరోపియన్ దేశాలలో అనేక సమ్మెలు జరుగుతున్నాయని, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, అర్జెంటినా మొదలగు దేశాలలో విజయవంతంగా సమ్మెలు జరిగాయని, పెట్టుబడిదారీ విధానంలో ప్రత్యామ్నాయ విధానలకు వ్యతిరేకంగా జరిగే ప్రపంచవ్యాప్త పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఫిబ్రవరి 16న బిజెపి కార్పొరేట్ – మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా రాస్తారోకోలు, రైల్ రోకోలు, చక్కాజామ్, ముట్టడులు, పికెటింగ్‌లు ఉధృతంగా జరపాలని, అదే సందర్భంలో రైతు – వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో బంద్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో ఆకలి, ఉపాధి, నిరుద్యోగం, దారిద్యం, ఆకలి చావులు, ఆత్మహత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, కార్పొరేట్, మతోన్మాద విధానాలను కార్మికవర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని, కార్మికులు, రైతులు కలిసి ఫిబ్రవరి 16 కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు జిల్లాల్లో, మండలాల్లో ప్రదర్శనలు, సభలు, సమవేశాలు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించాలని, బిజెపి మతోన్మాద విధానాలను ఎండగడుతూ కార్మిక, కర్షకులను చైతన్యపర్చి 2024 పార్లమెంటు ఎన్నికల్లో కార్మిక వర్గం యొక్క నిర్ణయాత్మక పాత్రను పోషించి, బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు.