సీపీఐ జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డిజఫర్ఘడ్ మార్చి 02జఫర్ఘడ్ మండల కేంద్రంలో గురువారం గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మాజీ మాజీ ఎమ్మెల్యే సి హెచ్.రాజారెడ్డి పాల్గొని మాట్లాడుతూ..నిరంకుశ పాలన కొనసాగిస్తున్న మోడీ గద్దె దిగాలని డిమాండ్ చేశాడు.అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించకుండా మోసం చేసి,రెండింతలు పెంచి సామాన్య ప్రజలపై పెను భారం వేసి,డబ్బున్న సంపన్నులు పయనించే విమానాల చమురు ధరలు తగ్గించడం ప్రజలను మోసం చెయ్యడమేనని అన్నారు.ప్రజలను ఎవరు గోస పెడుతున్నారో అర్థం అవుతుందని విమర్శించారు.మోడీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలు వాడే వస్తువుల అన్నింటిపై పన్నులు పెంచి కార్పొరేట్ సంపన్నులు కట్టే టాక్స్ ను తగ్గించారని, అలాగే 70 సంవత్సరాల నుండి లాభమే కానీ నష్టాలు తెలవని ఎల్ ఐ సి నేడు 70వేల కోట్ల నష్టం వాటిల్లిందని,రూపాయి మారకం విలువ డాలర్ కు 64 నుండి 83 కు చేరిందని ఇదంతా ప్రజలకు,దేశానికి నష్టమే కానీ ఉపయోగం లేదని విమర్శించారు.రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి సీపీఐ కార్యకర్తలు నడుం బిగించలని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మినేని వెంకట్ రెడ్డి,బికేఎంయు జిల్లా అధ్యక్షులు మండల.గట్టుమల్లు నాయకులు యాకుబ్ పాషా మంద.బచ్చయ్య,జాఫర్ అజ్జురి.వెంకన్న రాడపాక.ప్రకాష్ కలకోట.ప్రభాకర్ శోభ వెంకటయ్య యాదగిరి తదితరులు పాల్గొన్నారు.