
బీసీ &ఎస్సీ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడేది బిజెపి పార్టీ మాత్రమే
బీసీ ,ఎస్సీ అనగారిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడేది బిజెపి పార్టీ మాత్రమేనని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నేబోయిన రాము యాదవ్ అన్నారు.తుంగతుర్తి నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య గెలుపు కోసం ఆయన అడ్డగూడూరు మండలంలోని జానకిపురం, చిన్న పాడిశాల , చౌల్ల రామారం ,కంచనపల్లి గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాము యాదవ్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందని, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అత్యున్నత స్థాయికి ప్రధాని మోడీ తీసుకెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని రానున్నది రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వమేనని బిజెపి తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి కడియం రామచంద్రాయ్య ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కడియం సోమన్న ,అసెంబ్లీ కో కన్వీనర్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ననుబోతు సైదులు, బూత్ అధ్యక్షులు యాదగిరి ,వివిధ గ్రామాల అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..