
భద్రాచలంలో వారం రోజుల క్రితం పాత ఎల్ఐసి ఆఫీస్ లైన్ లో బి ఎస్ ఎన్ అండర్ గ్రౌండ్ కేబుల్ ని రాగి గా మార్చి అమ్ముకున్నారు వీరిని సీసీ కెమెరాల సహాయంతో ఈ ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయటం జరిగింది. వివరాల్లోకి వెళితే రాజమండ్రి కి చెందిన వేముల రమణయ్య, గుంజా వెంకన్న, వేముల దుర్గారావు, వేముల యేసు, వేముల కనక రాజు, వేముల ఎర్రయ్య లు అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కూలీలుగా పని చేస్తూ ఉంటారు. దీనిని అవకాశం గా తీసుకొని తొర్రూర్ లో ఉన్న రమేష్ గుడ్స్ వెహికల్ నీ కిరాయికి తీసుకొని వారం రోజుల క్రితం ఆ వాహనంలో ఆరుగురు వ్యక్తులు తొర్రూరు నుండి వారి భార్యా పిల్లల్ని తీసుకొని భద్రాచలంలో పాత ఎల్ఐసి ఆఫీస్ లైన్ లో బి ఎస్ ఎన్ ఎల్ వైరు రిపేర్ ఉందని చెప్పి తవ్వి సుమారు 75 మీటర్లు కేబుల్ వైరు నీ దొంగిలించారు. దానినీ రాగి గా మార్చి తొర్రు లో రమేష్ అనే వ్యక్తి కి అమ్మేరు. భద్రాచలంలోనే రాకుండా గత ఐదు ఆరు నెలల నుండి ఇతర పట్టణాల్లో కూడా ఈ విధంగా నేరం చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఎస్ ఐ మధు ప్రసాద్ కేసు నమోదు చేసి దొంగిలించిన కేబుల్ని రాగిగా మార్చి విక్రయించగా వచ్చిన 70 వేల రూపాయలు రికవరీ చేశారు. భద్రాచలం ఏ ఎస్ పి పరితోస్ పంకజ్ నేరస్తులను అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో సి ఐ నాగరాజు రెడ్డి, ఎస్ ఐ మధు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.