
నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలిమతోన్మాద రాజకీయాలను సమూలంగా నాశనం చేయడమే భగత్ సింగ్ కు ఇచ్చే నివాళి
సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి
దేశ స్వాతంత్రం కోసం చిరుప్రాయంలోనే ఉరుకంభం ఎక్కిన త్యాగదనడు విప్లవ వీరుడు భగత్ సింగ్ పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని, నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం సాగించాలని,మతోన్మాద రాజకీయాలను కూకటి వేళ్ళతో సమూలంగా నాశనం చేయాలని అదే భగత్ సింగ్ కు మనం ఇచ్చే ఘన నివాళి అని సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అన్నారు. సర్దార్ భగత్ సింగ్ 116 వ జయంతి సందర్భంగా భద్రాచలం పట్టణం పాత మార్కెట్ సెంటర్ నందు భగత్ సింగ్ విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు బి వెంకటరెడ్డి పూలమాల లు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గడ్డం స్వామి మాట్లాడుతూ దేశానికి రాజకీయ స్వాతంత్రం సాధించడమే కాకుండా, ఆర్థిక స్వతంత్రం కూడా సిద్ధించాలని, సామాన్యుడి సంక్షేమం సహకారం కావాలంటే సోషలిజం పంథాను అనుసరించాలనే సమగ్ర రాజకీయ దృక్పథంతో ఉద్యమించిన నాయకుడు భగత్ సింగ్ అని అన్నారు. మతాన్ని రాజకీయాలనుండి దూరంగా ఉంచాలని, ప్రజల్లో మతసామరస్యం పెంపొందించాలని, శ్రామిక వర్గం చైతన్యంతోనే ప్రజల ఐక్యత సాధ్యమని నినదించిన వీరుడు సర్దార్ భగత్ సింగ్ అని అన్నారు. మతం పేరుతో రాజకీయాలు నడిపే సంఘాలు పార్టీలు నేడు భగత్ సింగ్ మావాడు అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. వలసవాదంలాగే మతతత్వం సైతం ప్రజలకు పెద్ద శత్రువు అని నినదించిన నాయకుడు సర్దార్ భగత్ సింగ్ అని అన్నారు. నేడు మత రాజకీయాలపై పాలన సాగిస్తున్న బిజెపి ప్రజల మధ్య ఐక్యత చీల్చి మత విభజన సృష్టిస్తుందని మతోన్మాద రాజకీయాల నుండి ప్రజలను రక్షించడమే నేడు మన ముందున్న కర్తవ్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు యు జ్యోతి, జి. లక్ష్మీకాంత్, ఎన్ నాగరాజు, పార్టీ నాయకులు కె సత్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.