భగత్ సింగ్ బాటలో.. మెమంతా.. ‘భగత్ సింగ్’ లం TPSK
Hyderabadమార్చి 23 న భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (TPSK )అధ్వర్యంలో..
మెమంతా ‘భగత్ సింగ్’ లం
బాలల్లో భగత్ సింగ్ వేషాధారణలతో ఊరేగింపులు ప్రదర్శనలు నిర్వహించి భగత్ సింగ్ ఏకపాత్రాభినయాలు, నాటిక లు ప్రదర్శించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సమావేశం నకు ముఖ్య అతిథిగా హజరై రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చారు నేడు మన దేశం సర్వత్ర సాంస్కృతిక సంక్షోభంలో ఉంది ప్రజల జీవితాలు ప్రజాస్వామిక హక్కులు ప్రజాస్వామిక సంస్కృతి పోరాట విలువలు తీవ్రమైన దాడికి గురవుతున్నాయి తిరోగమన సంస్కృతి పతన విలువలూ ప్రచారం చేస్తున్నా.. ఈ పరిస్థితుల్లో పురోగమన శక్తులు ప్రగతిశీల ప్రత్యామ్నాయ శక్తులు ఏకమై భగత్ సింగ్ ఆశయాలబాట లో బాలలను ,యువత ను ప్రత్యామ్నాయ సంస్కృతి వైపు నడిపించాలని కోరారు మార్చి 30 ఉగాది కవి సమ్మేళనలు మరోవైపు “ఉగాది పచ్చడి సెవిద్దాం- భారత రాజ్యాంగాన్ని పఠిద్దాం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సాంస్కృతిక కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ “సమభావన” ఉగాది -రంజాన్ సందర్భంగా సాంస్కృతిక సమాలోచనలు చర్చా గోష్టి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు దాశరథి, ఆరుద్ర శత జయంతి సభలను వారి సాహిత్యాన్ని పాటల పల్లకి కార్యక్రమం ఎప్రిల్ మొదటి వారంలో జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం హైదరాబాద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గుమ్మడి నరేష్, రాజయ్య గౌడ్, ఎన్ నాగేశ్వరరావు మహేష్ దుర్గే హాజరు కావడం జరిగింది