
సిపిఎం మండల నాయకులు, గ్రామ కార్యదర్శి వడ్లకొండ సుధాకర్.
భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో ఆదివారం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో అతి చిన్న వయస్సులో దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు అన్ని,భగత్ సింగ్ స్ఫూర్తితో అన్యాయాలు,అవినీతి,అక్రమాలు, దోపిడీపై పోరాడాలన్నారు. నేటి విద్యార్దులు,యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని,వాటిని అధిగమించి సేవా కార్యక్రమాలు క్రీడా రంగాల్లో ముందుండాలనీ వారు అన్నారు.విద్యార్థులను యువతులను చైతన్యపరచడంలో భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు.భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్దులు మంచి అలవాట్లు, లక్షణాలు నేర్చుకోవాలని,అన్యాయాలు,అవినీతి,అక్రమాలు, దోపిడీపై పోరాడాలనీ వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నక్క యాకన్న వేల్పుల పెద్ద రాములు వడ్లకొండ రాజు రాపర్తి రహిత రాపర్తి లక్ష్మి చినూరు వెంకటమ్మ ఎండి శంషుద్దీన్ పులిగిల్ల నాగరాజు అవధూత రాజు చిన్న రాములు రాపర్తి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.