
E69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) భూపాలపల్లి నియోజవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి రాకేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సాయి ప్రదీప్ రెడ్డి అధ్వర్యంలో భగత్ సింగ్ 116 జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ నాగుల అరవింద్ పాల్గొన్నారు. మొదటగా డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బందితో కలిసి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్ ఆశాల కోసం పని చేస్తామని అన్నారు. అవినీతి అంతం చేయడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందని అన్నారు. భగత్ సింగ్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందని అన్నారు. యువత భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలన్నారు. అనంతరం హాస్పిటల్స్ సూపర్డెంట్ నవీన్ కుమార్ రక్తదాన కార్యక్రమం నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు అభినందనలు తెలియజేస్తూ అభినందన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, కిరణ్, సంతోష్, సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.