
telugu galam news e69news local news daily news today news
భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో గ్రామపంచాయతీ డెవలప్మెంట్ ప్లానింగ్ (GPDP ) గ్రామసభలో పట్టణ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. సభలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో కరెంటు లైన్లు లేని కాలనీలో కరెంటు స్తంభాలు వేయాలని,కాలనీలలో అవసరమైన చోట సైడ్ డ్రైన్లు మరియు సిసి రోడ్లు నిర్మించాలని,రామాలయం దగ్గరలో కరకట్టపై ఉన్న డంపింగ్ యార్డును తరలించాలని,ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీ కేంద్రాలకు పక్కాభవనాలు లేక అద్దె ఇండ్లలో నిర్వహిస్తున్నారని తక్షణమే పక్కా భవనాలు నిర్మించాలని అన్నారు. భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇవ్వాలని,పని అడిగిన వారికి ఉపాధి హామీ పనులు చూపించాలని కోరారు. పట్టణంలో అనేక గృహాలకు ఇంటి పన్నులు వేయలేదని ఇంటి పన్నులు లేనివారికి ఇంటి పన్నులు వేయాలని అన్నారు. పట్టణంలోని అన్ని కాలనీలలో కరెంటు స్తంభాలకు ఎల్ఈడి లైట్లు వేయాలని, కాలనీలలోని ఖాళీ స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలు చెట్లలో పందులు వేరవిహారం చేస్తున్నాయని పెరిగిన పిచ్చిమొక్కలను, చెట్లను తొలగించాలని కోరారు. చెడిపోయిన చేతిపంపులకు(బోరింగ్) మరమ్మత్తులు చేయాలని, తదితర సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులకు సభ్యులు ఎంబి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కమిటీ సభ్యులు చుక్కా మాధవరావు, ఎస్ డి ఫిరోజ్, జి లక్ష్మణ్, శాఖ కార్యదర్శులు బి ధర్మారావు, ఏ లక్ష్మీనారాయణ సీనియర్ నాయకులు రాజలింగం తదితరులు పాల్గొన్నారు…