
BADRACHALAM NEWS PRAJA PANTHA
భద్రాచలం లో బ్లడ్ టెస్ట్ ల పేరుతో వేలకు వేలు రూపాయలు వసూలు చేస్తున్న ల్యాబ్స్ పై డిఎం అండ్ హెచ్ ఓ గారు తనిఖీలు చేయాలి భద్రాచలం పట్టణంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ల్యాబ్స్ భద్రాచలం మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ బీసీ పేద ప్రజలు కూడా ఈ ఏరియాలో ఏ ఒక్క చిన్న అనారోగ్యానికి గురైన ఆసుపత్రికి వస్తూ ఉంటారు ప్రతి ఒక్క చిన్న టెస్ట్ కి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి బయట ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాబ్స్ కి సిఫార్ చేస్తూ ఉంటారు చిన్న టెస్ట్ కి వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటువంటి ల్యాబ్స్ కి ప్రైవేట్ లాబ్స్ కి మెడికల్ డిపార్ట్మెంట్ ఎలా పర్మిషన్ ఇస్తుంది. డి ఎం ఎం హెచ్ ఓ ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం లో ఉన్న ఏరియా ఆసుపత్రిలో కూడా ప్రభుత్వ డాక్టర్లు అయ్యి ఉండి ప్రైవేట్ ల్యాబ్ కి ఎందుకు సిఫారసు చేస్తున్నారు వారికి ఏమైనా కమిషన్లు రూపంలో పర్సంటేజ్ రూపంలో ఏమైనా ఇస్తున్నారా? ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్ టెస్ట్ చేయాలని అలాగే ఈ ప్రైవేట్ ల్యాబ్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పంద నాయకురాలు కెచ్చల కల్పన, పి డి ఎస్ యు నాయకులు మునిగల శివప్రశంత్ డిమాండ్ చేస్తున్నారు.