
భద్రాచలం వద్ద కరకట్ట పరిశీలన మరియు రివ్యూ మీటింగ్ లో మంత్రి పొంగులేటి
ఐటీడీఏ పీవో మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి భద్రాచలం వద్ద కరకట్టను పరిశీలించి రాబోవు వర్షాకాలం దృష్ట్యా వరదల వలన తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వరద బాధితులకు అందించాల్సిన సహాయ సహకారాల కొరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో గోదావరి వరద ముంపుకి గురి అయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.