ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకారంగా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తున్నదని ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణం వద్ద 22.07.24 సాయంత్రం 06:51 గం నీటి ప్రవాహం 43 అడుగుల స్థాయికి చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలకు వెళ్లాలని ఆయన సూచించారు.