భారీ వర్షం వరద ఉధృతికి నష్ట పోయిన పొలాలు
సూర్యాపేట జిల్లా, మునగాల మండల కేంద్రంలో, భారీ వర్షాలకు రామసముద్రం వాగు ఒడ్డున ఉన్న రైతుల పొలాలు పూర్తిగా వరద ఉధృతికి మాధవరం రెవిన్యూ పరిధిలో గల విజయరామపురం గ్రామ రైతులకు సంబంధించి సుమారు 50 ఎకరాల వరి పొలాలు పూర్తిగా నీటిలో మునిగి నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్న సూర్యాపేట జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బచ్చు అశోక్ మునగాల మండల ఏవో బొంగ రాజు నీ
తీసుకొని వెళ్లి పరిశీలించారు. తధానంతరం పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించి, ప్రభుత్వం తరఫున అందే ఆర్థిక సాయం అందించాలని, వ్యవసాయ అధికారిని కోరారు. ఏవో సానుకూలంగా స్పందించి, తప్పకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరఫున వచ్చే సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల ఏవో, నష్టపోయిన రైతులు బత్తిని లక్ష్మీనారాయణ గన్న రవి సుంకర రమేష్ గన్న లక్ష్మీనారాయణ పర్సన్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు