గత కొద్దీ రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదాడ రూరల్ ఎస్సై సాయి ప్రశాంత్ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని చెరువులు కుంటలు వాగులు, కాలువలు ఉదృతంగా ప్రహిస్తున్నాయని కావున ఇలాంటి సమయంలో మండల ప్రజలు ప్రమాదకరంగా ప్రవహించే వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఎస్సై సూచించారు. అదేవిధంగా పాడుబడిన మిద్దెలు, పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్లల్లో, చెట్ల కింద, ఎవరు ఉండవద్దని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు ప్రారంభం అయినందున రైతులు తమ పొలాల్లో వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ మోటార్లు వద్దకు వెళ్లి స్టార్టర్ల స్వీచ్ ఆన్ ఆఫ్ చేయవద్దని, రోడ్ల వెంట వున్న విద్యుత్ స్తంబాలు పట్టుకుంటే విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా రానున్న రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే స్థానిక పోలీసులకు లేదా 100కు డయల్ చేసి సమాచారం అందిస్తూ పోలీసు వారికి సహకరించాలని వారు తెలిపారు