భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Suryapetపట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలోని పలు వార్డుల్లో నిన్న కురిసిన భారీ వర్షాలకు జలమయమైన ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలను మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున యుద్ధ ప్రాతిపదికన జెసిబిల సహాయంతో మున్సిపల్ సిబ్బంది చె మరుగునీరు సాఫీగా వెళ్లే విధంగా కాలువల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను తొలగిస్తున్నట్లు తెలిపారు.వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నందున పట్టణ ప్రజలందరూ అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అన్నారు. శిథిలవస్థలో ఉన్న భవనాల్లో ఉంటున్న వారు వెంటనే ఖాళీ చేసి తమ బంధువుల ఇళ్లకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం మున్సిపాలిటీలో ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని 7995569076 కు ఫోన్ చేస్తే సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు కోట మధు,కట్టేబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్, వంటిపులి రమా శ్రీనివాస్,గుండెల సూర్యనారాయణ, మేదర లలిత, ఖాజా మొయినుద్దీన్,తొగరు రమేష్,డాక్టర్ బ్రహ్మం,ప్రతాపరెడ్డి, వంశీ నాని తదితరులు పాల్గొన్నారు.