ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లిజయశంకర్ భూపాలపల్లి జిల్లా భాజపా కార్యాలయంలో భాజపా అర్బన్ కార్యదర్శుల ఎన్నిక జరిగింది.భూపాలపల్లి అర్బన్ బిజెపి అధ్యక్షులు గీస సంపత్ భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శిలుగా కరివేద మనోహర్ రెడ్డి,జోరు కృష్ణ, శీలం రాజును ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా కరివేద మనోహర్ రెడ్డి,జోరు కృష్ణ, శీలం రాజు మాట్లాడుతూ మా పై నమ్మకంతో అర్బన్ ప్రధాన కార్యదర్శిలుగా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ అభివృద్ధి కి మా వంతు కృషి చేస్తామని వారు అన్నారు.మా ఎన్నికకు సహకరించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నం యుగదీశ్వర్, వెన్నంపల్లి పాపయ్య కి జిల్లా నాయకులు దొంగల రాజేందర్ కి బట్టు రవికి అర్బన్ అధ్యక్షులు గీస సంపత్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు అన్నారు. ఈ పదవి తమ భుజాలపై మరింత బాధ్యతను పెట్టి పార్టీ కోసం మరింత సమయం కేటాయించేలా చేసిందని వారు అన్నారు.భాజపా లో అందరికీ సమన్యాయం జరుగుతుందని మళ్లీ పార్టీ నాయకత్వం నిరూపించిందన్నారు.