
భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.బుధవారం హసన్ పర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులను పరిష్కరించారు, ఇంకా ఎన్ని దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందనే వివరాలను తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూభారతి దరఖాస్తులపై నిబంధనల మేరకు విచారణ చేసివాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ రహీం పాషా, గిర్ధావర్ రాజేంద్ర ప్రసాద్, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.