telugu galam news e69news local news daily news telugu news
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని శివుని పల్లి గ్రామంలో నిన్న ఉదయం సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది.ఎలాంటి గవర్నమెంట్ నిధులు తీసుకోకుండా స్వచ్ఛందంగా శివునిపెళ్లి గ్రామ ప్రజలు విగ్రహాన్ని కొనుగోలు చేసి గ్రామపంచాయతీ మండలాధికారులు కలెక్టర్ ద్వారా అనుమంతులు తీసుకున్నప్పటికీ ఆవిష్కరించిన రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో శివుని పల్లి గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఆదేశానుసారం గ్రామ పంచాయతీ సిబ్బంది విగ్రహానికి నల్ల ముసుగు వేయడం జరిగింది.దీనికి ఆగ్రహించిన గ్రామ ప్రజలు స్వాతంత్ర సమరయోధులైన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అవమానపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్వాతంత్ర సమరయోధులను అవమానించడమే కాకుండా శివునిపల్లి గ్రామ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం జరిగిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి వేసిన ముసుకుని తొలగించి పాలభిషేకం చేయాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.