
ఈ69న్యూస్ మంచిర్యాల
భారత రాజ్యాంగ సృష్టికర్త డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు,స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ కూడా పాల్గొన్నారు.జై బాపు–జై భీమ్–జై సంవిధాన్ నినాదాలతో సభావేదిక మార్మోగింది.సభలో నాయకులు అంబేద్కర్ ఆవిర్భావం,ఆయన సేవలు,మరియు సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.అదేవిధంగా,జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు,స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.