
telugu galam news e69news local news daily news today news
రేగొండ మండల కేంద్రంలోని రావులపల్లి లో గల శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అయోధ్యలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా కటకం జయంతి సంపత్ దంపతులు ప్రసాద వితరణ కోసం 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది.ప్రత్యేక పూజల అనంతరం సంపత్ గారిని శాలువాతో సన్మానించిన ఆలయ చైర్మన్ గన్ రెడ్డి లింగారెడ్డి ఆచార్యులు సముద్రాల సురేష్ గారు వైస్ చైర్మన్ పెండల్ రాజు అన్నారపు రమణారెడ్డి దుంపేటి నాగరాజు మేకల రాజు మేకల లింగయ్య అన్నారపు బుచ్చిరెడ్డి తక్కలపల్లి క్రాంతి తదితరులు ఉన్నారు.