
నడిగూడెం గ్రామంలో సమస్య ఉంది అని సమాచారం తెలిస్తే చాలు తక్షణమే అక్కడకు వాలిపోయి సమస్య పరిస్కారం కోసం కృషి చేస్తూ ప్రజల చేత శబాష్ అనిపించుకుంటాడు సుదీర్ అనే యువకుడు.అందులో భాగంగా నెల రోజుల నుండి మండలంలోని ఎస్ బి హెచ్ బ్యాంక్ ఎదురుగా ప్రధాన రహదారి వెంట ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ లీకేజ్ కావడం తో రహదారి మొత్తం బురద నీరు చేరి బ్యాంక్ కు వచ్చే, రహదారి పై ప్రయాణించే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న.. అటువైపుగా ఎంతోమంది ప్రజా ప్రతినిధులు,నాయకులు,
అధికారులు నిత్యం ప్రయాణం చేస్తుంటారు అయిన తమకు ఏమి పట్టనట్లు వస్తూ పోతున్నారు. ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని, స్థానికులు శనివారం సుధీర్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని తన వంతుగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లీకేజ్ నీరుని పక్క కాలువకు మళ్ళించాడు సుదీర్. విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా సమస్య ఎవరిదైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్య లకు పరిష్కారం లభించే వరకు పోరాటం చేస్తున్న సుదీర్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు.