
telugu galam news e69news local news daily news today news
సూర్యాపేట జిల్లా మునగాల మండలం వడ్డెర సంఘం అధ్యక్షులుగా పల్లపు సతీష్, ప్రధాన కార్యదర్శి వరికుప్పల వీరస్వామి లకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆలకుంట్ల బాలకృష్ణల చేతుల మీదగా నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పల్లపు సతీష్ మాట్లాడుతూ…. నా మీద నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వడ్డెరల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉన్న వడ్డెరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.