
మండల వ్యాప్తంగా గృహలక్ష్మికి 2194 దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి మండల వ్యాప్తంగా 2194 దరఖాస్తులు వచ్చాయని తాసిల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. ప్రజల సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకంతో ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకునే గడువు నాలుగు రోజులు ఇవ్వగా నాలుగు రోజులలో మండలం లోని అన్ని గ్రామాల నుండి 2194 దరఖాస్తులు వచ్చాయని దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు