
మండి బజార్ ఖుర్షీద్ హోటల్ లో యువకుడిపై దాడి
వరంగల్ నగరంలోని మండి బజార్ ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర దాడి సంఘటన చోటుచేసుకుంది.గిర్మాజిపేటకు చెందిన నీలారపు రణవీర్ (21) అనే యువకుడు తన తమ్ముడు సూర్యతో కలిసి శనివారం ఉదయం 4.30 గంటల సమయంలో కుర్షీద్ హోటల్‌కు బిర్యానీ తినడానికి వెళ్లాడు.అయితే అదే సమయంలో అక్కడ ఉన్న నితీష్,తరుణ్,చందు మరియు మరికొందరు వ్యక్తుల మధ్య మాటామాటా జరుగగా,గొడవ పెరగడంతో వారు రణవీర్‌పై దాడి చేశారు.ఈ ఘటనలో రణవీర్ తీవ్రంగా గాయపడ్డాడు.ప్రాథమిక విచారణలో కుర్షీద్ హోటల్ యజమాని కుర్షీద్ కూడా ఈ ఘటనలో పాత్ర వహించినట్లు పోలీసులకు సమాచారం లభించింది.అతను ప్రభుత్వ నిబంధనలు మరియు వరంగల్ సిటీ యాక్ట్‌ను ఉల్లంఘించినట్లు తేలడంతో అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మట్వాడ ఎస్హెచ్ఓ ఎన్.కరుణాకర్ రావు మాట్లాడుతూ..అన్ని వ్యాపారులు,షాప్ యజమానులు ప్రభుత్వ నిబంధనలు,చట్టాలను కచ్చితంగా పాటించాలి.చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు