మంత్రి గారూ! మా బైండ్ల వాడను బాగు చేయండి
Jangaonఈ69 జఫర్ఘడ్ డిసెంబర్ 02
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో బైండ్ల వాడలో వాగు మరమ్మతు చేసి సి.సి రోడ్డు వేయాలని స్థానికులు మీడియా ద్వారా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును వేడు కుంటున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ్మడపల్లి జి గ్రామంలోని 4వ వార్డు బైండ్ల కాలినీకి చెందిన మా వార్డులో 40ఇండ్లు ఉన్నాయి,మా వార్డు మధ్యలో వాగు ఉండడం వలన వర్షా కాలంలో వరదలకు ఇండ్లలోనికి నీరుతో పాటు పాములు,తేల్లు వస్తున్నాయని,వరదల కారణంగా ఇండ్ల నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి అని అన్నారు.ఈ సమస్య
కొన్ని ఏండ్ల నుండి ఉన్నదని,గ్రామ పంచాయతీకి పలుమార్లు వాగు మరమ్మత్తు చేసి సి.సి రోడ్డు వేయమని మొర పెట్టినా పట్టించు కోవడం లేదని వాపోయారు.కావున మా యందు దయ ఉంచి మా వార్డు ను బాగు చేయగలరని మంత్రి దయాకర్ రావును వేడుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బైండ్ల కాలినీకి చెందిన ఏ.రవి,శ్రీ రాములు,లక్ష్మి,రేనుక,సత్తమ్మ,సోమయ్య,జయమ్మ,బక్కయ్య,సోమనర్సు,అబ్బయ్య,స్వామీ,రాజేశ్వరి,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.