మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని మార్యదపూర్వకంగా కలిసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
Jangaonఈ రోజు…హైదరాబాద్ లోని మినిస్టర్ హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక , వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖమంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి
1.స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల హాస్పిటల్ నుండి 100 పడకల హాస్పిటల్ గా అప్గ్రేడేషన్ మంజూరు చేయుటకు మరియు
2.చిల్పూర్ మండల కేంద్రంలో , తమ్మడపల్లి(జి)-జాఫర్గడ్ మండలం మరియు మల్లికుదుర్ల-వేలేరు మండలం చొప్పున స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గానికి మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేయుటకు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఎమ్మెల్యే డా.రాజయ్య గారు వినతిపత్రం ఇచ్చి కోరగా మంత్రి గారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గారు తెలిపారు.
మంత్రిగారు సానుకూలంగా స్పందించడమే కాకుండా పనులు మంజూరు చేయడంతో పాటు ఆయా పనుల శంఖుస్థాపన కార్యక్రమాలకు కూడా తప్పకుండా వస్తానని మంత్రిగారు మాట ఇచ్చారని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో జూన్ 2 , 2023 నుండి జూన్ 22 వరకు 21 రోజులపాటు చేపట్టిన పల్లెప్రగతి నివేదన యాత్ర-పల్లెనిద్ర కార్యక్రమానికి సంబంధించిన రోజువారి కార్యక్రమాలతో కూడిన ఫోటోగ్రఫీ బుక్ లెట్ ను గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి అందజేయగా అది చూసిన మంత్రివర్యులు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారిని అభినందించారు.