మంత్రి తుమ్మల ను కలిసిన ఎమ్మెల్యే మట్టా
మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుకు కార్యకర్తలను సిద్ధం చేయండి:తుమ్మల నాగేశ్వరరావు(రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును స్వగృహంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయిదయానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను శాసన సభ్యురాలు రాగమయి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తెచ్చారు.ఆయన పరిష్కారానికి కృషి చేద్దామని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోనీ కల్లూరు మరియు సత్తుపల్లి మున్సిపాలిటీలో రానున్న పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనo ఎగరవేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అన్ని వార్డుల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు వివరించే విధంగా పార్టీ యంత్రాంగాన్నీ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఎమ్మెల్యే కు దిశ నిర్దేశం చేశారు.