కరీంనగర్ జిల్లాలోనీ ఇందిరా గార్డెన్ లో బీసీ కుల సంఘాల అధ్వర్యంలో ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జి కొలిపాక సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి పొన్నంకు శాలువాతో సన్మానం చేసి మేమొంటో అంద జేశాడు.ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ..ముఖ్యంగా బీసీ కుల గణన జరగాలని గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు పోరాటాలు దశాబ్దాల పాటు చేసిన ప్రతి ఫలం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఏర్పాటు చేయడం సంతోషం కలిగించే విషయం 2023 ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోవడంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కి రుణపడి ఉంటామని అన్నారు.సతీష్ తో పాటు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి శ్రీనివాస్,గజ్జెల్లి వెంకన్న,దేవరకొండ శ్రీనివాస్,అవుదుర్తి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.