మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా క్రికెటర్
తెలంగాణ క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి
ఇటీవల ముగిసిన ఉమెన్ వరల్డ్ కప్ 2025లో తనదైన పాత్రతో భారత్ తరఫున ప్రతిభ కనబరిచిన క్రికెటర్ అరుంధతి రెడ్డి ఈరోజు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ సందర్భంగా మంత్రి గారు అరుంధతిని సన్మానించి, ఆమెకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ విసి & ఎండి డాక్టర్ సోని బాలదేవి, కోచ్ ఆకాష్, అరుంధతి తల్లి భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.