
telugu galam news e69news mulugu news sethakka news congress news
గళం న్యూస్:ములుగు
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఇప్పలగడ్డ గ్రామంలోని ప్రజలకు బ్లాంకెట్లు పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్.
సోమవారం రోజున సాయంత్రం 07:00 గంటలకు గోవిందరావుపేట మండలం ఇప్పలగడ్డ గ్రామంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో బ్లాంకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ విచ్చేసి ప్రజలకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు.
అనంతరం అశోక్ మాట్లాడుతూ సీతక్క మంత్రి అయిన దగ్గరి నుండి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నదని, అయిన సీతక్క ఆలోచన మన నియోజకవర్గ ప్రజలపైన ఉంటుందని అన్నారు. చలికాలం వలన అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలకు బ్లాంకెట్లు అందించాలని కోరగా, వెంటనే మన గ్రామానికి విచ్చేశానని అన్నారు. సీతక్క నిత్యం ప్రజల గురించి మాత్రమే ఆలోచించే నిఖార్సైన నాయకురాలు అని అన్నారు. సీతక్క ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తూ, ములుగు జిల్లా అభివృద్ధి కోసం పాటు పడే నాయకురాలు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో INTUC జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, NSUI జిల్లా అధ్యక్షులు మామిడిశెట్టి కోటి, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్యా రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.