మట్టి గణపతులను పంపిణీ చేసిన నగేష్ ముదిరాజ్
మట్టి గణపతులను పంపిణీ చేసిన నగేష్ ముదిరాజ్
వినాయక చవితి సందర్భంగా టీపీసీసీ ప్రదాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ విత్తన మట్టి గణపతులను పంపిణీ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల విత్తన మట్టి విగ్రహాల పంపిణి చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మట్టి విగ్రహాలు పూజించి భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నారు. ఈ సందర్బంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు